సడి సేయకో గాలి సడి సేయబోకే - రాజమకుటము



సడి సేయకో గాలి సడి సేయబోకే
సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడి సేయకే

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే
సడి సేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటె నేనూరుకోనే
సడి సేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
పీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరి పోరాదే

సడి సేయకో గాలి
సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడి సేయకే ...

1 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

" కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని బావ కడ కురియ రాదా ? " అని మేఘానికి వినతి చేసినా ...
" నిదుర చెదిరందంటే నేనూరుకోనే _ సడి సేయబోకే ! " అంటూ గాలిని శాసించినా ... అది కృష్ణ శాస్త్రికే చెల్లింది !
ఆ మహా కవికి జోహారులు ! ఆయన పాటను గుర్తు చేసిన మీకు అభినందనలు !

Post a Comment