నీలాల కన్నులో మెల్ల మెల్లగా - నాటకాల రాయుడు

నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే

చిరుగాలి బాల పాడింది జోల పాడింది జోల
చిగురాకు మనసు కనుపాపలందు ఎగపోసేనమ్మ ఏవేవో కలలు
కలలని కళలేనో విరబూయగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే

నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఉగింది లాలి
గగనాని చూచి ఒక కన్ను దోయి వినిపించమంది ఎనెన్నో కథలు
కథ చెప్పి మురిపించి మరపించగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే

2 comments:

వేణూ శ్రీకాంత్ said...

చాలా మంచి పాటలు పోస్ట్ చేస్తున్నారండీ.. మీ బ్లాగ్ అద్భుతం గా ఉంది.

SRRao said...

Mee paatala pustakam manchi prayatnam. konasaaginchandi.

Post a Comment