విరిసినది వసంతగానం - భైరవ ద్వీపం



విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మయచేసినది

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం
రమ్మంది మొహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించే ఆమని పులకించే కామిని
వసంతుడే చెలికాంతుడై
దరి చేరే మెల్లగా

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

ఋతువు మహిమేమో విరితేనే
జడివానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరచి
మురిసేను తరువు హాయిగా
రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగాగా
మారుడే సుకుమరుడై
జతకుడే మాయగా

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

Thanks to viswanath for youtube video

3 comments:

Vinay Chakravarthi.Gogineni said...

nice song....especially veturi gaari lyrics....

రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగాగా

పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించే ఆమని పులకించే కామిని

excellent lines.....

సెలయేరు said...

వినయ్ గారు,
ఈ పాట రాసింది వేటూరి గారు కాదండి, సింగీతం శ్రీనివాస రావు గారు.

Vinay Chakravarthi.Gogineni said...

sorry ..i forgot ...thx for correcting....

Post a Comment