ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గుదొంతరలు
ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకులు కలువకు కానుకగా
ఎద సరసన ఎగసిన అలజడి అలలే తాకగా
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా గుసగుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూద శిఖామణులూ
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
1 comments:
బాగుంటుంది పాట, మోడరన్ పెళ్ళి సంతోషాలు బాలు గొంతు లో అధ్బుతం గా ఇమిడి పోయాయి..
Post a Comment