ఏడు కొండలపైన - జ్యోతి



ఏడు కొండలపైన ఏలవెలిసావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
ఏడు కొండలపైన ఏలవెలిసావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
తెలియని వారికి తెలుపర స్వామీ
తెలియని వారికి తెలుపర స్వామీ
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏల వెలిసావో
ఎవరికీ అందక ఎందుకున్నావో

ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావూ
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏముడిని ఎందుకో విడదీసిపోతావూ
అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఏ అర్థమున్నదో ఏ సత్యమున్నదో
తెలియని వారికి తెలుపర స్వామీ
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏలవెలిసావో
ఎవరికీ అందక ఎందుకున్నావో

పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో
రెండు ప్రేమల మధ్య బండగా మారావు
స్వామీ రెండు ప్రేమల మధ్య బండగా మారావు
రేపు లేని నీకు దోపిడి ఎందుకో
తెలియని వారికి తెలుపర స్వామీ
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండల పైన ఏలవెలిసావో
ఎవరికీ అందక ఎందుకున్నావో

శ్రీలు పొంగిన జీవగడ్డయి - లీడర్



శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడరా తమ్ముడా

వేద శాఖలు వెలసెనిచ్చట
ఆది కావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మదువోలికేనిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిది తమ్ముడా

పాండవేయుల పదనుకత్తుల
మండి మెరసిన మహితరణకధ
పండగల చిక్కని తెలుంగుల
కలిపి పాడవే చెల్లెలా

దేశగర్వము దీప్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరిసిన ధీరపురుషుల
తెలిసి పాడరా తమ్ముడా

లోకమంతకు కాక బెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని బొడిచి త్రిళ్లి
భంగపడని తెలుంగునాధుల
పాటపాడరా తమ్ముడా

మేలి కిన్నెర మేళవించి
రాలు గరగగ రాగమెత్తి
పాలతియని బాలభారత
పధము పాడవె చెల్లెలా