కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి
మందార మాట విని మౌడ్యమున కైకేయి రామలక్ష్మణులను అడవికి పంపే కదా శకుని మాయలు నమ్మి జూదమున ఓడించి కౌరవులు పాండవుల కష్ట పెట్టిరిగా పరుల భోదకు లొంగి పండు వంటి సంసారాని భాగాలుగా చీల్చి పంచుచుండిరి కదా
కలిసి వుంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఖం చెడు భోదలు విన్నారంటే ఎవరికైన తప్పదు కష్టం
కలిసి వుంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఖం చెడు భోదలు విన్నారంటే ఎవరికైన తప్పదు కష్టం
చిట్టి చీమలన్నీ మూగి పెద్ద పుట్ట పెట్టునురా చిట్టి చీమలన్నీ మూగి పెద్ద పుట్ట పెట్టునురా శిల్పులంతా కట్టుగా వుండే తాజ్ మహలు కట్టిరిరా జనులేందరో త్యాగము చేసి స్వరాజ్యము తెచ్చిరి రా కలిసి వుంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఖం
పది కట్టెలు ఒక్కటిగా వుంటే పట్టి విరువ లేరురా ఒక కట్టేగ ఉంటేనే వికలము చేసేరురా కర్ణుడొకడు చేరక పోతే భారతమే పూజ్యము రా యాదవులే ఒక్కటిగా ఉంటే నాశనమై ఉండరు రా
కలిసి వుంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఖం కలిసి వుంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఖం
తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
ప్రాంతాలు వేరైనా మన అంతరంగ మొకటేనన్న యాసలు వేరుగవున్న మన భాష తెలుగు భాషన్న
వచ్చిండన్న వచ్చారన్న వచ్చిండన్న వచ్చారన్న వరాల తెలుగు ఒకటేనన్న
మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏదికాదన్న ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
పోచంపాడు ఎవరిది నాగార్జునసాగరమేవరిది మూడు కొండ్రలూ కలిసి దున్నిన ముక్కరు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్‌కి జై గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము వందేమాతరం వందేమాతరం స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర
దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది